పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 6: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) భాగంగా పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి (Unanimous). గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో మల్లారం సుజాత మల్లేశం, కల్వల అనిత తిరుపతి, సలిగంటి స్వప్న భాస్కర్, పోతు రజిత వెంకటేశ్, బండారి త్రివేణి అనిల్, రావుల స్వప్న గోపిలు సర్పంచ్ పదవులకు పోటీలో ఉన్నారు. ఇక గ్రామపంచాయతీలో 10 వార్డు స్థానాలు ఉండగా, ఒకటి, 4వ, 8వ వార్డు స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. దీంతో పొన్నం రమేష్ యాదవ్ (1వ వార్డు), కాల్వ సదానందం (4 వ వార్డు), వంగ అనిల్ (8 వ వార్డు) స్థానాలకు వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది.