మంథని, జూన్ 24 : మంథని పట్టణంలోని దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంథని పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడంతో భయోందోళనకు గురువుతున్నారు. గత 3 రొజుల క్రితం ధర్మారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి చాతీపై కాలుపెట్టి మూడు తులాల పుస్తెల తాడు చోరీ చేసిన ఘటన మరవక ముందే పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దొంతులవాడకు చెందిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడ్డారు.
దవాఖాన నిమిత్తం కుటుంబమంతా హైదరాబాద్‌కు వెళ్లగా గమనించిన దుండగులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువలో ఉన్న రూ. 25వేల నగదు, దాదాపు కిలో కుపైగ ఉన్న వెండి విగ్రహాలు, ల్యాబ్ టాప్‌తో పాటు విలువైన వస్తువులు ఎత్తికెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు కుటుంబం ఇంటికి రాగా చోరీకి గురైన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు డాగ్స్ స్కాడ్‌తో క్లూస్ సేకరించారు. వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసులు దొంగలను పట్టుకొనే విషయంలో విఫలం అయ్యారని ప్రజలు ఆరోపించారు.