odela | ఓదెల, ఏప్రిల్ 9 : బీసీ బాలుర వసతి గృహంలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలనీ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తహసిల్దార్ కార్యాలయం, బీసీ బాలుర వసతి గృహం సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ధరణి దరఖాస్తుల పెండింగ్ ఉంచకుండా చూడాలని అన్నారు. బిసి బాలుర వసతి గృహంలో రూ.9 లక్షలతో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.
వసతి గృహంలో డోర్స్, కిటికిలు, టాయిలెట్స్, విద్యుత్ మరమ్మతు పనులు, పేయింటింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వసతి గృహంలో షెడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సునీత, ఏఈ జగదీష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.