సుల్తానాబాద్ రూరల్ మార్చి 16 : శ్రీ కేతకీ దేవి సహిత మల్లిఖార్జున స్వామి(Mallikarjuna Swamy temple) ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన శ్రీ కేతకీ దేవి సహిత మల్లికార్జున స్వామి , మహాగణపతి, ఆంజనేయ, నవగ్రహ, జమదగ్ని సహిత రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు తొలి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోల్గురి అంజయ్య గౌడ, స్థానిక మాజీ ఉపసర్పంచ్ ఆవుల వెంకటేష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నల్లంగి సదయ్య, ఆవుల మల్లేష్, అట్ల లచ్చయ్య పాల్గొన్నారు.