Singareni Contract Labourers | రామగిరి, ఏప్రిల్ 08 : సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యమే వైద్య సహాయం అందించాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆర్జీ-3 బ్రాంచి కార్యదర్శి చిప్పకుర్తి అరవింద్ డిమాండ్ చేశారు.
ఇవాళ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఆర్జీ-3 ఏరియాలోని ఓసీపీ -1లోని ఎస్ అండ్ డీ సెక్షన్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు అనవేన సంపత్‌కు ఇవాళ షావల్ దగ్గర పని చేస్తుండగా ట్రాక్ ఐరాన్ ముక్క పొట్ట భాగంలో తగలగానే తీవ్ర రక్తస్రావం అయింది.. వెంటనే గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించగా ఏరియా హాస్పిటల్ వైద్యులు అతనికి ఎక్స్ రే తీసి ఇందులో ఐరన్ ముక్క ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ఇక్కడ ఈ ఆపరేషన్‌కు సరిపడే పరికరాలు లేవన్నారన్నారు.
అధికారులు కూడా పట్టించుకోకుండా చేతులెత్తేసి బాధ్యతను కాంట్రాక్టర్‌పై నెట్టివేశారు. కాబట్టి భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని దవాఖానాలో అన్ని పరికరాలు అందుబాటులో ఉంచాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రెఫరల్ చేసే సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఓసీపీ -1లో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కాంట్రాక్టు కార్మికుడు సంపత్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్