గోదావరిఖని : సింగరేణి(Singareni) సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5 ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన భారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యమైన 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 15 రోజుల ముందుగానే సాధించి రికార్డు సృష్టించింది. 2024-25 సంవత్సరానికి గాను 36 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 15 రోజుల ముందే సాధించినందుకు అర్జీ-1 ఏరియా జీఎం లలిత్ కుమార్ సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గత నెల సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం ఐ.ఆర్.ఎస్ గారు “కార్మిక చైతన్య యాత్ర” ద్వారా ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యోగులను ఉత్పత్తి ఉత్పధాకతా పై అవగాహన కల్పించటం ద్వారా కలిసికట్టుగా సాధించారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కె చంద్రశేఖర్, సేప్టీ అధికారి పొనుగోటి శ్రీనివాస్, ప్రాజెక్టు ఇంజినీర్ రమేష్, సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ అనిల్ గబలే, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిప్యూటి మేనేజర్ పెరుమాళ్ల శ్రీనివాస్, గుర్తింపు సంఘం ఏఐటియుసి పిట్ సెక్రెటరీ ప్రభుదాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.