Ramagiri | డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి :ఎస్ఐ తాడవేని శ్రీనివాస్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి ఎస్ఐ తాడవేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
రామగిరి, జూన్ 10 : నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని రామగిరి ఎస్ఐ తాడవేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆన్లైన్ మోసాలు, ఓటీపీలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ లింకులు, సోషల్ మీడియా మోసాల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా లింక్‌లకు స్పందించవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర పనులు చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుమన్, గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

