పెద్దపల్లి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారపూరితమైనవని న్యాయవాది శశికాంత్ కాచే విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల కష్టాలు, కన్నీళ్లను చూసి చలించిపోయి పదవులకు త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ప్రాణత్యాగాలకు సైతం సిద్దపడి చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు.
అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయనకు వృద్ధాప్యంలో కిందపడి కాలు విరిగితే అమర్యాదకరంగా స్ట్రెచర్ మీద నుంచి మార్చురీకి పోతాడని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మాట్లాడిన మాటలు పూర్తిగా అహంకార పూరితమైనవని విమర్శించారు. ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. ఈ మాటలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.