సుల్తానాబాద్ రూరల్ జూలై 30 : ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల క్రాసింగ్ వద్ద గురువారం ఆర్డీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. కాల్వ శ్రీరాంపూర్ నుంచి సుల్తానాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు సుల్తానాబాద్ నుంచి ఓదెల మండలం కొలనూర్ వైపు వెళ్తున్న కారు సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల క్రాసింగ్ వద్ద ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి.
ఈ సంఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదాన్ని గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలను పెట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.