పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరామపూర్ మండలం చిన్నరాత్ పల్లికి చెందిన జర్నలిస్ట్(Journalist) బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు, జిల్లా మార్కెటింగ్ అధికారి పడిగెల ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారుల నుంచి సేకరించిన నగదును జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డితో కలిసి కాల్వ శ్రీరాంపూర్ లోని రాజశేఖర్ నివాసానికి వెళ్లి అందజేశారు. రోడ్డు ప్రమాదంలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడి కాలును కోల్పోవడం దురదృష్టకరమన్నారు. అధికారుల సంఘం తరఫున రాజశేఖర్ ను అందరి సహకారంతో ఆదుకుంటామన్నారు.