సుల్తానాబాద్ రూరల్, మే 29: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో (Gurukula School) ఇటీవల విడుదలైన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల విద్యాలయానికి రూ. ఐదు లక్షలు అభివృద్ధి కోసం చెక్కు అందజేశారు.
ఈనెల 28న హైదరాబాదులోని ప్రజా భవన్ లో ప్రిన్సిపాల్ గిరిజ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అభినందించి, గర్రెపల్లి గురుకుల విద్యాలయానికి అభివృద్ధి కోసం ఐదు లక్షల చెక్కు ను అందజేశారు. గర్రెపల్లి గురుకుల విద్యార్థులు విద్యలో రాణించి మంచి ఫలితాలు సాధించినందుకు పలువురు ప్రిన్సిపల్ను అభినందించారు.