Ramagundam Corporation | కోల్ సిటీ, మార్చి 21: రామగుండం నగర పాలక సంస్థ వంద శాతం ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నెపంతో చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఎలాగైనా బకాయిలు రాబట్టుకునేందుకు రెడ్ నోటీసులను జారీ చేస్తోంది. గతంలో ఆస్తి పన్ను మొండి బకాయిలు చెల్లించడానికి వడ్డీ మాఫీ వెసులుబాటు కల్పించేది. వాడవాడనా మైక్ ప్రచారం చేసేది. వడ్డీ మాఫీ ఆఫర్‌తో ఊరట లభించేది. దాంతో ఎంతో కొంత పన్నులు వసూలయ్యేవి. కానీ ఇప్పుడు మొదటిసారిగా కఠినమైన రెడ్ నోటీసులను జారీ చేస్తోంది.
బకాయిలు చెల్లించని వారి ఇళ్లకు మున్సిపల్ సేవలను నిలిపివేస్తోంది. అప్పటికీ ఆస్తి పన్ను చెల్లించని బడా బకాయిదారుల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ హెచ్చరిక కూడా జారీ చేశారు. మొండి బకాయిదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్పొరేషన్ కు ఎక్కువ మొత్తంలో బకాయి పడిన వారి జాబితాను తయారు చేసి తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.
ఆర్‌ఆర్‌ఏ ప్రకారం సదరు ఆస్తులను జప్తు చేసి వేలం వేయడానికి సిద్ధమవుతున్నారు. చివరి హెచ్చరికగా రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించని వారిపై ఈ కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇంటి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్సు బకాయిలు రాబట్టుకునేందుకు కఠినంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.
నగర పాలకసాధారణ నివాస గృహాలపై ఉక్కుపాదం..
సంస్థలో రూ.19.74 కోట్ల పన్ను లక్ష్యంగా ఉండగా, ప్రైవేటు సంస్థల నుంచి రూ.12.33 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.7.4 కోట్లు రావల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపు రూ.14 కోట్ల వరకు వసూలైనట్లు తెలుస్తోంది. మొత్తం 4,470 దుకాణాల నుంచి ట్రేడ్ లైసెన్సు రూపేణా రూ.76.25 లక్షలు వసూలు కావల్సి ఉంది. సినిమా థియేటర్లు, బడా ప్రైవేటు ఆస్తుల నుంచి మొండి బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. పన్ను బకాయి ఉన్న సాధారణ నివాస గృహాలపై ఉక్కుపాదం మోపుతుండటం పట్ల ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వడ్డీ మాఫీ వెసలుబాటు ఉండేదనీ, ప్రస్తుత విధానాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్