Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. రామగుండం పట్టడానికి చెందిన అనుమాస శ్రీనివాస్ రెండోసారి రైల్వే బోర్డు మెంబర్ గా నియామకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన సేవలు సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో కొనసాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొలిపాక వీరస్వామి తిప్పారపు రామ్మోహన్, చల్లా రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.