మంథని, మార్చి 30: శ్రీ విశ్వావసు నామ నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరికి విజయాలే వరించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినం సందర్బంగా మంథని పట్టణంలోని రాజగృహాలో హిందు, ముస్లిం, క్రైస్తవ సోదరులతో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ దంపతులు షడ్రుచుల ఉగాది పచ్చడిని అందరికి అందజేశారు.
ఆనంతరం మధుకర్ మాట్లాడుతూ.. ఉగాది షడ్రుచుల పచ్చడి మాదిరిగా అన్ని కులాలు, మతాల ప్రజలకు కలిసిమెలసి జీవిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని ఆయన ఆకాక్షించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మంథని నియోజకవర్గం ప్రజలందరికీ మంచే జరగాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని రైతులకు సరిపడా సాగునీరు అంది పంటలు సంవృద్ధిగా పండేలా భగవంతుడి సాకారం అందాలన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.