Puli Prasanna Harikrsihna | సుల్తానాబాద్ రూరల్, జూన్ 10 : భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పులి ప్రసన్నహరికృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల, మంచిరామి గ్రామాల్లో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల కార్యక్రమానికి మంగళవారం పులి ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయాలలో పులి ప్రసన్న హరికృష్ణ పూజలు చేశారు. అంతకుముందు ఆయా గ్రామాల గౌడ కులస్తులు ప్రసన్న హరికృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనకు శాలువాలను కప్పి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు. పడాల అజయ్ గౌడ్, ఎరుకోండ రమేష్ గౌడ్, తిరుపతి గౌడ్, మోల్లుగురి అంజయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు గుర్రం సత్తయ్య, లక్ష్మణ్, గుర్రం శ్రీనివాస్ శ్రీధర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.