పెద్దపల్లి మార్చ్ 31 (నమస్తే తెలంగాణ): రంజాన్ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని చందపల్లి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల వకు చట్టాన్ని తీసుకురావడంతో దానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వక్ఫ్‌బోర్డు చట్టం తీసుకురావడం ద్వారా వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని వారు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా బయట ప్లకార్డులు చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రార్థనలో పాల్గొన్నారు.