కోల్ సిటీ, మార్చి 4: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శివాలయంలో పద్మశాలి మహాసభల పోస్టర్ను పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు మంగళవారం ఆవిష్కరించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సభలకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు.
పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాయమల్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య, తెలంగాణ పద్మశాలి సేవా సంఘం ఆర్గనైజ్ సెక్రటరీ బుర్ల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెటి రాజేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చందు పెగడ, పోపా అధ్యక్షులు వడ్డేపల్లి దినేష్, మూర్తి, సిరిపురం నరసయ్య, గుండెటి శంకర్, అన్నల్ దాస్ శ్రీనివాస్, బొద్దుల వేణు, కన్నం ప్రభాకర్, రాజేష్, దాసరి శ్రీనివాస్, బండారి స్రవంతి, తౌటం శాంతి, చింతల రాజేందర్, నాగేశ్వర రావు, సోడాల శ్రీను, బొడ్డుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.