Voters List | పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా తుది ఓటరు జాబితాను శనివారం అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ పర్యవేక్షణలో రూపొందించిన తుది ఓటరు జాబితాను ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు.
ఈ నెల 11 నుంచి ప్రారంభమైన ఓటరు జాబితా కసరత్తు నేటితో ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ రమణ, ఏపీవో రమేష్ బాబు, ఈజీఎస్టిఏ వెంకటేష్ గౌడ్, సిబ్బంది సుజాత, ప్రశాంత్, శ్రీరామ్, రవి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు