పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 08: పెద్దపెల్లి (Peddapalli) జిల్లా స్థాయిలో ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీల్లో ప్రతిభ చాటిన పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయికీ ఎంపికైనట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీ. లక్ష్మణ్, వేల్పుల కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో పెద్దపల్లిలో నిర్వహించిన సీనియర్స్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పెద్దపల్లి నుంచి జాతీయస్థాయి ఖో -ఖో క్రీడా పోటీలకు శశికుమార్ (బాలుర విభాగం) నుంచి మనస్వి రావు (బాలికల విభాగం ) నుంచి ఎంపికయ్యారని చెప్పారు.
అలాగే జూనియర్స్ విభాగం నుంచి Y. నిఖిల్ (బాలురు), నాగజ్యోతి (బాలికల విభాగం) నుంచి జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. వీరు రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి ఖో-ఖో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఖో-ఖో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘం బాధ్యులు వరల్డ్ కప్ కోచ్ ఇ.నరేష్, భూపాలపల్లి నారాయణ, వేల్పుల సురేందర్, ఎండీ. శఫియోద్దిన్, ఉమామహేశ్వర్, తిరుపతి రెడ్డి జాతీయస్థాయికి ఎంపికైన క్రీఢాకారులకు అభినందనలు తెలియజేశారు.
