పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లా అల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ (Handball Competition)పోటీలు ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్నాయి. ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంటుకు ఎంపికైన పెద్దపెల్లి జిల్లా జట్టు ఆదివారం బయలు దేరి వెళ్లినట్లు జిల్లా హ్యాండ్ బాల్ కన్వీనర్ డాక్టర్ వేల్పుల సురేందర్ తెలిపారు.
ఈ టీంకు కోచ్ అండ్ మేనేజర్ గా పీఈటీలు తిరుపతి, అరుణ్ కుమార్ వ్యవహరిస్తారని పీడీ సురేందర్ పేర్కొన్నారు. అలాగే అప్పన్నపేట జడ్పీఉన్నత పాఠశాల నుంచి సిద్ధార్థ, సృజన్, చరణ్ అనే ముగ్గురు విద్యార్థులు ఎంపిక కాగా వారిని అప్పన్నపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సట్టు పురుషోత్తం సీనియర్, ఉపాధ్యాయులు రామేశ్వర్, అశోక్, రాజేశ్వర్, కనకయ్య, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు అభినందించారు.