Peddapalli | పెద్దపల్లి రూరల్ జనవరి 09 : పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేట శివారులో దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆహ్వానించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, సీఐ ప్రవీణ్ కుమార్‌ను పోల్సాని సుధాకర్ రావు ఆధ్వర్యంలో సర్పంచ్, పలువురు జాతర కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఈ మేరకు ఏసీపీ కార్యాలయ ఆవరణలో ఆహ్వాన పత్రికను అందజేసి జాతర కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు భయ్య కొమురయ్య యాదవ్, గణమనేని తిరుపతిరావు, రంగు వెంకన్న గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.