Manthani | మంథనిలో ప్రశాంతంగా పంచాయతీ పోరు..! నాలుగు గంటల్లో 52.42శాతం పోలింగ్..
Manthani | తొలి విడుత పంచాయతీ ఎన్నికలు డివిజన్ పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నది.
Manthani | మంథని, డిసెంబర్ 11 : తొలి విడుత పంచాయతీ ఎన్నికలు డివిజన్ పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నది. ఆయా మండల్లాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఆయా మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో 1,43,856 మంది ఓటర్లకు 75,412 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దాంతో 52.42 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మంథనిలో 55.57 శాతం, కమాన్పూర్లో 53.80 శాతం, రామగిరిలో 49.94, ముత్తారంలో 44.95, కాల్వ శ్రీరాంపూర్లో 49.14 శాతం నమోదైందని తెలిపారు. మంథనిలోని గుంజపడుగు, నాగారం, చిల్లపల్లి పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, క్యూ లైన్లు, బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులతో పాటు ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

