మారుతీనగ ర్ (జగిత్యాల), జూలై 26 : సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే 10 నెలలకు అధికారులు బదులిచ్చారు. బాధితుడు నాంపల్లి గట్టయ్య కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన 8 కుటుంబాలకు 13 గుంటల భూమి ఉంది. రెండు గుంటలను కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ గట్టయ్య గతేడాది సెప్టెంబర్ 6న ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 23న ప్రజావాణిలో రిజిస్టర్ అయినట్టు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. 3 నెలల తర్వాత అండర్ ప్రాసెసింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చూపించింది. ఈ ఏడాది మార్చి 11న మరోసారి ప్రజావాణికి ఫిర్యాదు చేయ గా.. 2 నెలల తర్వాత మళ్లీ గ్రీవెన్స్ స్టేటస్‌లో అండర్ ప్రాసెసింగ్ ఎట్ రెవెన్యూ ఆ ఫీస్ మెట్పల్లి అని చూపించింది. కానీ ఆదివారం (జూలై 26) ఆర్ఐ ఫోన్ చేసి.. సీఎం ప్రజావాణికి ఫిర్యాదు చేసిన దానికి సమాధాన పత్రాన్ని తీసుకోవాలని పిలిచి మోమో ఇచ్చారు.
క్రయవిక్రయాలు సబ్‌రిజిస్ట్రార్ మెట్పల్లిలో జరిగాయని, సమ స్య పరిష్కారానికి ఆక్రమణదారుపై ఎస్హెచ్వోలో కేసు నమోదు చేసుకోవాలని మెమోలో సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండా ఆక్రమణకు గురిచేసిన వారిని పిలిపించకుండా మెమో ఇవ్వడంతో ఫిర్యాదుదారు ఆశ్చర్యపోయాడు. తాను రెండోసారి (ఈ ఏడాది మార్చి 11న) ప్రజావాణికి రిజిస్టర్ పోస్టు చేయ గా.. అదే రోజున మెమో జారీ చేస్తే 4నెల ల తర్వాత అధికారులు తనకు మెమో ఇచ్చారంటూ బాధితుడు వాపోయాడు. ఆర్ఐ నివేదిక తేదీని ఖాళీగానే ఉంచారని తెలిపాడు. సీఎం ప్రజావాణికే రెండుసా ర్లు ఫిర్యాదు చేస్తే అధికారులు 10 నెలల తర్వా త సమాధానం ఇస్తుండగా.. జిల్లా కేంద్రా ల్లో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదుదారులకు సమాధానం ఎన్ని రోజులకు వస్తుందోనని ప్రజలు పెదవి విరుస్తున్నారు.