గడిచిన రోజులన్నీ..
అన్నం తింటున్న షడ్రుచులు నాలుకను తాకుతున్నా నిన్న మట్టికుండలో తాగిన
అన్నం తింటున్న షడ్రుచులు
నాలుకను తాకుతున్నా
నిన్న మట్టికుండలో తాగిన
గంజిలోని కమ్మదనమే
మనసు లాగుతుంది
వెండిపళ్లెంలో పంచభక్ష్యాలు
కొలువుదీరినా
బంగారు గిన్నెలో అమృతమే నిండిపొర్లినా
పొలం గట్టున కూర్చొని
ఉల్లిపాయ కొరుకుతూ
సద్దిసారం రుచి ముందు ఇవన్నీ
దిగదుడుపే అనిపిస్తుంది
దేహాన్ని చుట్టుముట్టిన
ఈ పట్టువస్ర్తాల ఆడంబరాల కన్నా
నిన్న నా పేదరికపు గుడారంలో
ఆ చిరిగిన వస్త్రమే
ఆత్మకు పరమ ఆనందాన్నిస్తుంది
పాలరాతి శీతల సమాధుల్లా
ఇంటి నీడల్లో ఊపిరాడని స్థితిలో పోలిస్తే
గాలీ వెల్తురులో ఆత్మీయంగా ముచ్చటించే
నా పూరిగుడిసె పవిత్ర దేవాలయంలా అగుపిస్తుంది
కాలం మారి నాగరికత
మారి వాయువేగాన అన్నీ
సంక్రమించినా ఇప్పుడు
కేవలం సుఖప్రాప్తి
ఆకలి వెంటాడినా దరిద్రం
దాడి చేసినా నీడలేక
ఆకాశమే కప్పు అయినా
గడిచిన రోజులన్నీ తృప్తి
ఎన్నున్నా ఆశ వీడలేదు నేడు
లేనితనమైనా అర్రులు చాచలేదు..
అమ్మతోడు
కోటం
చంద్రశేఖర్
9492043348
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

