లండన్: హెచ్ఐవీతో జీవిస్తున్న యువతలో రోజూ గోలీలు వేసుకోవడం కంటే ప్రతి ఎనిమిది వారాలకు ఒకసారి ఇచ్చే యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) ఇంజెక్షన్లు మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ది లాన్సెట్ వైద్య జర్నల్లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్) పరిశోధకులు ఆఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్లో ఈ విషయాన్ని గుర్తించారు. రోజూ తీసుకునే మాత్రలతో పోలిస్తే ఇంజెక్షన్ల ద్వారా హెచ్ఐవీ వైరస్ను అణచివేయడం సమర్థవంతంగా ఉన్నట్లు తేలింది.