దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రచురించిన మాదారపు వాణిశ్రీ రచన ‘పూటకూళ్ళవ్వ’ నవల ఆవిష్కరణ హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో గల ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుందని ట్రస్ట్ చైర్మన్ ఎం.వేద కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పుస్తకాన్ని కే.ఆనందచారి ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.ఎస్.రఘు, డా. కొండపల్లి నీహారిణి, డా.ఇడికోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొంటారని తెలిపారు.