సమర్కండ్ : చెస్ ఒలింపియాడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఐదో రౌండ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఓపెన్ కేటగిరీలో భారత్ 3-1తో హాలండ్‌పై గెలిచి వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది. ప్రజ్ఞానంద.. అనీష్ గిరిని ఓడించగా జోర్డెన్ వాన్ ఫారీస్ట్తో మ్యాచ్‌ను అర్జున్ డ్రా చేసుకున్నాడు.
నిహాల్ సైతం వాన్ విలీతో పాయింట్‌ను పంచుకోగా గుకేశ్.. ఎర్విన్‌ను ఓడించాడు. కానీ మహిళల విభాగంలో భారత్‌కు 1.5-2.5తో పోలండ్ షాకిచ్చింది. హంపి, దివ్య, వంతిక మ్యాచ్‌లు డ్రా గా తేలగా వైశాలి ఓటమిపాలైంది.