గద్వాల, జూలై 26 : ఎగువన వర్షాలు కురువడం తో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తూ వస్తుంది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ ఉదయం ఆ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు అయినా జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండడ ంతో రైతులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 22,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరా ల ప్రాజెక్టు త్వరలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది.
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316. 310మీటర్ల నీటి నిల్వ ఉంది. ప్రస్తుత ప్రాజెకు ్ట పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.653 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. జూరాల కు ఉదయం 6గంటలకు వరద ప్రారంభం కాగా ఉద యం ఇన్‌ఫ్లో 3,227, పది గంటల వరకు 4200 క్యూసెక్కుల వరద రాగా, 12గంటల వరకు 8500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. సాయంత్రం 3గంటల వరకు 18300, ఆరుగంటల వరకు 22, 600 క్యూసెక్కులకు వరద పెరిగి జూరాలకు వచ్చి చే రుతుంది. జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో వానకాలం సాగుపై రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి.
అయిజ, జూలై 26 : కర్ణాటకలోని ఎగువ ప్రాం తాల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాం కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం టీబీ డ్యాం కు ఇన్‌ఫ్లో 12,915 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,561 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠ నీటి మ ట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1606.50 అడుగుల నీటి మట్టం ఉండగా, 105. 788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 31.183 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని డ్యామ్ సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.
కృష్ణ, జూలై 26 : మహరాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆదివారం నారాయణపూర్ డ్యాం నుంచి 37,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణానదికి వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది దిగువన ఉన్న పరిసర ప్రాంతాల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కృష్ణానదిలో చుక్క నీరు లేకుండా పో యింది. జూన్‌లోనే నాట్లు వేసుకునే రైతు ఇప్పటి వర కు సాగు చేయకుండా అలానే ఉండిపోయారు. ఇప్పుడు కృష్ణానదికి వరద రావడంతో రైతుల కండ్ల ల్లో ఆశలు నింపుకొని, వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు.