28న ఎస్కేఎం అఖిల భారత సదస్సు
ఈనెల 28న ఢిల్లీలోని మింటో రోడ్ కేఎస్ ఆడిటోరియంలో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత సదస్సు నిర్వహిస్తున్నామని ఎస్కేఎం ప్రతినిధులు ఆదివారం తెలిపారు.
హైదరాబాద్, జూలై 26 (నమస్తేతెలంగాణ) : ఈనెల 28న ఢిల్లీలోని మింటో రోడ్ కేఎస్ ఆడిటోరియంలో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత సదస్సు నిర్వహిస్తున్నామని ఎస్కేఎం ప్రతినిధులు ఆదివారం తెలిపారు. దేశవ్యాప్త ఎస్కేఎం సభ్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, కనీస మద్దతు ధర, తదితర డిమాండ్లపై కార్యాచరణ ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు.
బీసీ ఆర్టిజన్స్ ఎగ్జిబిషన్‌కు విశేష ఆదరణ
హైదరాబాద్, జూలై26 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ‘ఆషాఢ బోనా లు – చేతి వృత్తుల మేళా’కు విశేష ఆదరణ లభించిందని ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ వెల్లడించారు. 11రోజులు నిర్వహించిన మేళా ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా అలోక్‌కుమార్ మాట్లాడుతూ గతేడాది 30స్టాళ్లతో ఐదు రోజులు నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను ఈసారి 60స్టాళ్లతో 11 రోజులపాటు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌తో కమ్మరి, కుమ్మరి, వడ్రం గి, మేదరి తదితర చేతివృత్తుల ఉత్పత్తులకు విసృ్తత ప్రచారం, మా రెటింగ్ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

