వనపర్తి, జూలై 26(నమస్తే తెలంగాణ) : కుటిల రాజకీయాలుమాని రైతాంగానికి సాగునీరివ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ ప్ర భుత్వాన్నికి కోరారు. కన్నెపల్లి, పాలమూరు-రంగారెడ్డి పథకాల్లో మోటర్లను వెంటనే ప్రారంభించి నీటి ని ఎత్తిపోయాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నదుల్లో నీటి పరవళ్ల దృష్ట్యా సాగునీటి పంపిణీపై మాజీ మంత్రి ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు తాబేరుగా మారాడ ని, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమైక్యవాది అని ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవన్నారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రజల ఆకలి, ఆకాంక్షల మీద సో యిలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉం టే వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నుంచి మో టర్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాల కింద ఉన్న అన్ని చెరువులు, కుంటలు నింపాలని, ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వస్తున్న వరద ప్రవాహా న్ని ఒడిసిపట్టాలన్నారు.
గడచిన రెండు నెలలుగా నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల ప్రాధాన్యతను గుర్తించడం లే దని, సరిపడా సాగునీటిని అందిస్తారన్న దాఖలాలు కూడా కనిపించడం లేదన్నారు. రైతు అవసరాలపై రేవంత్ సర్కార్ ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తుందని, ఎల్నినోలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం రైతుల ను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అన్నదాతల ఆగ్రహానికి గు రికావల్సి వస్తుందని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. కుంటి సాకులతో రైతుల పొలాలు సాగునీటి పంపిణీకి మొండి చేయి చూపించవద్దని, తక్షణమే సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నింటినీ ప్రారంభించి రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు.