పెద్దపల్లి : సంచార జాతుల సంక్షేమానికి కృషి చేస్తుంది సీఎం కేసీఆర్ మాత్రమే కృషి చేస్తున్నారని తెలంగాణ పూసల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పూసల సంఘ సభ్యులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంచార జాతులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పూసల సంఘాన్ని గుర్తించి హైదరాబాద్‌లోని ఉప్పల్ భాగాయత్‌లో ఎకరం భూమి, కోటి రూపాయల ఫండ్ కేటాయించడం గొప్ప విషయం అన్నారు.
ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంచార జాతులలో 35 కులాలను గుర్తించి, వారికి హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలను ఏర్పాటు చేసుకునేందుకు భూమి, ఫండ్స్ ఇవ్వడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందన్నారు.
కార్యక్రమంలో TRS పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, సంఘం జిల్లా అధ్యక్షుడు పొదిల్ల కుమార స్వామి, ప్రధాన కార్యదర్శి ముద్రకోల తిరుపతి, కోశాధికారి సదానందం, వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్, వైస్ ప్రెసిడెంట్ పట్టేం నర్సయ్య లతో పాటు పట్టణ అధ్యక్షుడు చెని కేశవులు, కోశాధికారి సతీష్, గౌరవ అధ్యక్షుడు ముద్రకోలా రాజయ్య, ప్రధాన కార్యదర్శి కోనేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.