సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 27: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని నీరుకుల్ల రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు 45 రోజులపాటు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అయ్యప్ప స్వామి దేవాలయ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, శంకరయ్య, నాగుల కుమారస్వామి, అల్లం సత్యనారాయణ, ఆలయ కమిటీ బృందం తదితరులు తదితరులు పేర్కొన్నారు.
నేటి నుంచి అయ్యప్ప మాల ధరించిన భక్తులందరూ ఇక్కడే అన్ని వసతుల్లో కూడిన సదుపాయాలు ఉన్నందున భక్తులు పెద్ద ఎత్తున నిత్య అన్నదాన కార్యక్రమము, నిత్య పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని అధ్యక్షుడు బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ జెడ్పిటిసి డాక్టర్ ఐల రమేష్ ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభిస్తున్నారని తెలిపారు.