Sakhi Services | పెద్దపల్లి రూరల్, జూన్ 26 : మహిళలు, బాలికల రక్షణ, సంరక్షణ విషయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంగా నడుస్తున్న సఖీ కేంద్రం సేవలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జీ స్వప్నరాణి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో గల సఖీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన జడ్జీ పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా సఖీ కేంద్రం అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయి.. ఎంతమందికి రక్షణ కల్పించి బాధల నుంచి విముక్తి కల్పించామనే విషయాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మహిళలు బాలికల సంరక్షణకు సంబంధించిన ప్రచార పోస్టర్ను మహిళా పోలీస్ స్టేషన్ అధికారులతో సఖీ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ ఆద్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ దారవేన స్వప్నయాదవ్, సభ్యులు పోలీసులు పాల్గొన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి