ICAR Scientists | పెద్దపల్లి రూరల్, జూన్ 01 : మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఆధునిక పద్దతులను అవలంభిస్తూ సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయం సాగు విదానాలను అవలంభిస్తే అధిక దిగుబడులతో కూడిన లాభాలు వస్తాయని రామగిరి కెవికె శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. పెద్దపల్లి మండలంలో బ్రాహ్మణపల్లి, రాగినేడు, కానగర్తి గ్రామాల్లో వ్యవసాయ శాఖ, KVK రామగిరి ఖిల్లా ఆధ్వర్యం లో వికాసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డా.కిరణ్, నరేష్ హైదరాబాద్ ఐసిఏఆర్ (icar) ప్రధాన శాస్త్రవేత్తలు డా.ముత్తు కుమార్, డా.యోగేష్, డా. పాల్ యాదవ్, సీనియర్ శాస్త్రవేత్త ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ, పౌల్ట్రీ రీసెర్చ్ శాస్త్రవేత్తలు, అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్, డైరెక్టర్ గండు వెంకటేష్ , పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి K.అలివేణి వ్యవసాయ విస్తీర్ణాధికారి పూర్ణచందర్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు సోదరులు ఖరీఫ్ సీజన్‌కి సిద్ధంగా ఉండాలని, వివిధ పంటలు కొత్త వంగడాలు గురించి రైతులకు వివరించారు. అలాగే సహజ వ్యవసాయ సాగు పద్ధతులు, ముందస్తు సాగు విధానం గురించి ప్రత్యేకంగా వివరించారు. అధీకృత విత్తన షాపుల్లోనే విత్తనాలు కొనుగోళ్లు చేయాలన్నారు. విత్తన కొనుగోలు రషీద్ పంట కాలం పూర్తి అయ్యేవరకు దగ్గర భద్రంగా పెట్టుకోవాలన్నారు. అధిక దిగుబడులు ఇచ్చే చీడపీడలు తట్టుకునే విత్తనాలు విత్తుకోవాలన్నారు.
పురుగు మందులు అవసరానికి మించి వాడకూడదు..
విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవాలన్నారు. పశువుల పేడ, కోళ్ల ఎరువు, తదితర సేంద్రీయ ఎరువులు వాడాలన్నారు. నాటు వేయడానికి ముందు పచ్చిరొట్ట ఎరువు పంటలు వేసి భూమిలో కలియ దున్నాలన్నారు. పురుగు మందులు అవసరానికి మించి వాడకూడదన్నారు. ఎరువులు యాజమాన్యం చీడపీడల యాజమాన్యం పంట తొలి దశ నుండి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు.
పాడి పశు సమృద్ధి ఎలా చేసుకోవాలి అని వివరించారు. ప్రదానంగా వివిధ పథకాలు వాటిని ఎలా వినియోగించుకోవాలో రైతులకు వివరించారు. మరింత వ్యవసాయ సమాచారం కోసం వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని వారి సమస్యలను చెప్పి శాస్త్రవేత్తల సలహా సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!