కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్ 28: తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన మహమ్మద్ రజాక్ (Mohammed Razak) నియమితులయ్యారు. ఈమేరకు జిల్లా అధ్యక్షులు మట్ట రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కె కళాధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ రజాక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, ఆత్మ గౌరవం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తనను నియమించిన జిల్లా అధ్యక్షులు మట్ట రాజన్న, ప్రధాన కార్యదర్శి కె కళాధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనుకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ తెలంగాణ ఉద్యమకారులను, కళాకారులను ఏకతాటిపైకి తెచ్చి వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడించారు.