Mobile Shop Owners | కోల్‌సిటీ , మార్చి 8 : గోదావరిఖని లక్ష్మీనగర్‌లో ఓల్డ్ అశోక్ బజారులో గల మొబైల్ షాపుల నిర్వాహకుల పరిస్థితి ముందు నుయ్యి… వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. సింగరేణి క్వార్టర్లను ఆనుకొని ఉన్న షెట్టర్లకు గతంలో ఆయా క్వార్టర్ల యజమానులు అద్దెలు వసూలు చేశారు. గత రెండు నెలల క్రితం రోడ్ల వెడల్పు పేరుతో సింగరేణి అధికారులు ఆ క్వార్టర్లను కూల్చివేసి వారికి మరోచోట క్వార్టర్లను కేటాయించారు. అక్కడ ఉన్న దుకాణదారుల విజప్తి మేరకు కూలకుండా కొద్ది రోజులు గడువు ఇచ్చారు.
ఐతే గతంలో అక్కడ క్వార్టర్ల యజమానులకు ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వకపోగా, పైగా రోజువారీగా అద్దెలు చెల్లించాలని పట్టుబడుతున్నారు. సింగరేణి స్థలంలో ఉన్న దుకాణాలు తమవే అంటూ కార్మికులు అద్దె వసూళ్లు చేయడం అయోమయంగా ఉంది. తమ అడ్వాన్స్‌లు తిరిగి ఇస్తే తాము ఖాళీ చేస్తామని మొబైల్ షాపుల నిర్వాహకులు చెబుతుండగా, అడ్వాన్సులు ఇచ్చేది లేదనీ, రోజుకు రూ.300 చొప్పున అద్దె ఇస్తేనే ఉండాలంటూ వేధిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఈ పంచాయతీ కాస్త గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
నాడు క్వార్టర్లను అనుకొని దుకాణాల నిర్మాణం..
కాగా, లక్ష్మీనగర్‌లోని వీకే రెడ్డి హోటల్ నుంచి మజీద్ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్లను అనుకొని గతంలో అందులో ఉంటున్న కార్మికులు షెడ్లు నిర్మించి ప్రైవేటు వ్యక్తులకు షాపుల నిర్వహణ కోసం అద్దెకు ఇచ్చారు. దశాబ్దాల కాలంగా ప్రతీ నెల రూ.10 వేల చొప్పున అద్దె తీసుకున్నారు. అంతేగాక ఒక్కో షాపు నిర్వాహకుడి వద్ద రూ. లకారం చొప్పున అడ్వాన్స్ కూడా తీసుకున్నారు.
ఐతే ఇటీవల కాలంలో లక్ష్మీనగర్‌లో ప్రధాన కూడళ్ల అభివృద్ధి పేరుతో సింగరేణి అధికారులు క్వార్టర్లను కూల్చివేసి, అందులో ఉంటున్న కార్మికులకు కౌన్సెలింగ్ ద్వారా ఇతర ప్రాంతంలోని క్వార్టర్లను కేటాయింది తరలించారు. ఆ క్వార్టర్లను ఆనుకొని ఉన్న దుకాణాలను కూడా తొలగించడానికి ప్రయత్నం చేయగా, స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించగా సదరు వ్యాపారులకు కొంతకాలం వరకు గడువు ఇచ్చారు. అసలు సమస్య ఇక్కడ నుంచే మొదలైంది.
దుకాణాలు తమవే అంటున్నారు..
క్వార్టర్లను కూల్చివేసి ఇతర ఏరియాలో క్వార్టర్లు తీసుకున్న సదరు కార్మికులు ఇప్పుడు దుకాణాలు తమవేనని అద్దె యథావిధిగా ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సింగరేణి క్వార్టర్లు కూల్చివేశాక కూడా దుకాణాలు తమవే అంటున్నారని పేర్కొంటున్నారు. లేదంటే తామిచ్చిన అడ్వాన్స్ ఇస్తే ఖాళీ చేస్తామని అడిగితే అడ్వాన్స్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. అంతేగాక ఆ దుకాణాలు ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో రోజుకు రూ.300 చొప్పున అద్దె ఇవ్వాలని షరతులు విధించారు.
అసలే షాపులు నడవక దిక్కుతోచని స్థితిలో తాముంటే తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఈ వ్యవహారం కాస్త గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. దీనితో షాపుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్