సుల్తానాబాద్ రూరల్ మార్చి 3 : పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన అన్ని వనరులను సిద్ధం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. జాప్యం లేకుండా ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలను దశలవారీగా చేపడుతున్నట్టు విజయరమణ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సాయిరి మహేందర్, దానాయక్ దామోదర్ రావు, దుగ్యాల సంతోష్ రావు, సతీష్ రావు, ఆనంద రావు, కాల్వల శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అబ్బాయి గౌడ్, శేఖర్, మాతంగి లచ్చయ్య, సుల్తానాబాద్ మండలం యూత్ అధ్యక్షులు అజయ్, దాసరి రాజమల్లు, తిరుపతి రెడ్డి, సంపత్ రెడ్డి, మల్లయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.