పెద్దపల్లి రూరల్ మార్చి16: పెద్దపల్లి నియోజక వర్గంలో మట్టిరోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు(MLA Vijayaramana Rao) అన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్లోని ఎస్సీ కాలనీ, దాసరి భూమయ్యకాలనీ, శ్రీరాంనగర్ లలో రూ. 35లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
మా గ్రామంలోని ఎస్సీ కాలనీకి మంచినీటి కొరత ఉంటుందని నీళ్ల సమస్య లేకుండా చూడాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే విజయరమణారావును కోరారు. సాధ్యమైనంత వరకు తాగునీటికి కొరత లేకుండా చూస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంట లావణ్య, ఆడెపు వెంకటేశం, కొయ్యెడ సారయ్యగౌడ్, కొయ్యెడ సతీష్ గౌడ్, సముద్రాల రాజ్ కుమార్ గౌడ్, ఎనగందుల ప్రదీప్, గండు లస్మయ్య, సిరిసిల్ల నర్సయ్య, సిరిసిల్ల శంకర్, బొడ్డుపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.