సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 17: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం మండలంలోని దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్నకల్వల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేజీ వీల్స్ తో రోడ్లపైకి వస్తే మొదటి సారి రూ.2000 రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, చిన్న కల్వల సింగల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు, సీఈఓ రమేష్ , నాయకులు మురళీధర్ రావు, మహేందర్, రాములు, సుగుణాకర్ రావు, విష్ణు రావు, కుమారస్వామి నారాయణ, సతీష్ ,పోచాలు, సత్యనారాయణ, దేవేందర్ రావు, అన్నమనేని మాధవ్ రావు, గుర్రం సత్తయ్య, మామిడి లింగయ్య, విజయ్, పాలకవర్గ సభ్యులు, రైతులు తదితరున్నారు.