పెద్దపల్లి : పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో రూ.10 లక్షలతో మడేలయ్య గుడి వద్ద నూతనంగా నిర్మించునున్న దోబీఘాట్కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.
కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సరేష్, బొడ్డుపల్లి రమేష్, బొడ్డుపల్లి రామ్మూర్తి, ముతూనూరి స్వామి, అశోక్, రమేష్, బొడ్డుపల్లి శ్రీనివాస్,శ్రీనివాస్, జగదీష్,రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.