పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురువారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని మనోహర్ రెడ్డి మంత్రి కోరారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.