Aamir khan | ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉన్న బాలీవుడ్ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు అమీర్ ఖాన్. కెరీర్లో ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ స్టార్ హీరో చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిందే.
ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ రెండు రోజుల సరదా ట్రిప్‌తో వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అమీర్ ఖాన్ ఎక్కడికి ట్రిప్ వేశాడనే కదా మీ డౌటు. ఈ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ పశ్చిమబెంగాల్లో జియాగంజ్‌లోని పాపులర్ బాలీవుడ్ సింగర్ అర్జీత్ సింగ్ ఇంటికెళ్లాడు. అర్జీత్ సింగ్ ఇంటిపై గాలిపటం ఎగరేశాడు. అక్కడే ఉన్నఅమీర్ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది ఈ మూమెంట్స్‌ను తమ కెమెరాల్లో బంధించారు. అమీర్ ఖాన్ గాలిపటం ఎగిరేస్తుంటే చుట్టు పక్కల వాళ్లు చూసేందుకు ఎగబడ్డారు.
ఇటీవలే అర్జీత్ సింగ్ సింగింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించి మ్యూజిక్, మూవీ లవర్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ అర్జీత్ సింగ్‌ను కలిసేందుకు వెళ్లడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
#AamirKhan at #ArijitSingh‘s house in West Bengal. Seems like they are shooting something pic.twitter.com/ac9hLBe8DW
— $@M (@SAMTHEBESTEST_) February 3, 2026