బీబీనగర్, ఫిబ్రవరి 03 : గ్రామీణ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా వైద్యులు, ఆశా వర్కర్ల సేవలకు బీబీనగర్‌లో ఘన గౌరవం లభించింది. జాతీయ మహిళా వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుjiని బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా.మౌనికతో పాటు మహిళా వైద్యులు, ఆశా వర్కర్లను మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ మంగళవారం ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మహిళా వైద్యులు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.
కష్ట సమయాల్లోనూ వెనకాడకుండా ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్న వీరి సేవలు సమాజానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల అశోక్, అమృతం శివకుమార్, పంజాల సురేష్ గౌడ్, దేవరుప్పల పృధ్వీ, టంటం భార్గవ్, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, బెండె ప్రవీణ్, దేవరకొండ శ్రీనివాస్, మరి వెంకటేష్, కృష్ణ, గణేష్ పాల్గొన్నారు.