ధర్మారం, జులై 10: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మూడు రోజుల క్రితం తిరుపతి తండ్రి మేడవేని చిన్నయ్య స్థానిక పెట్రోల్ బంకు వద్ద బొలెరా వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో మరణించారు. దీంతో లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండల కేంద్రానికి వచ్చి తిరుపతితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్నయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం మృతుడు చిన్నయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంట ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్ కాంపెల్లి రాజేశం, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఓ. శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగ్గిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం, పార్టీ నాయకులు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, కాంసాని ఎల్లయ్య, దేవి కిషోర్, ఓరేం చిరంజీవి, కోమటిరెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.