సుల్తానాబాద్ రూరల్ జూన్03 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని ఎంఈఓ రాజయ్య అన్నారు. ఎస్జీటీ యూనియన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నాలుగో రోజులో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని నాణ్యమైన విద్యను పొందాలని గ్రామస్తులకు సూచించారు. కాగా, ప్రధానోపాధ్యాయులు పూసాల రజని తన కుమార్తెను తాను పనిచేస్తున్న ఇదే పాఠశాలలో 5వ తరగతిలో నమోదు చేశారు.
వైకే ఫౌండేషన్ సభ్యులు సాయి మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించుటకు ముందు ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూమేష్ ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్, యూనియన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల కిషన్, తుల సుధాకర్ రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఊకంటి విజేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బారాజు రమణారెడ్డి, గోనె సత్యం, ఉపాధ్యాయులు రవీందర్, ఆంజనేయులు, పరశురాం, శ్రీలత, జయలు పాల్గొన్నారు.