కోల్ సిటీ, ఫిబ్రవరి 25 : గోదావరిఖని రమేష్ నగర్ ఏరియాలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి(Mega medical camp) విశేష స్పందన లభించింది. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, ఇతరులు ఈ శిబిరానికి హాజరు కాగా జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి బీపీ, షుగర్, 2 డి ఏకో పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేశారు.
మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ సింగరేణి రిటైర్డ్ కార్మిక కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. 24 గంటల పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ శిబిరంలో డివిజన్ నాయకులు గట్ల రమేష్, రామస్వామి, కృష్ణ, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్, హరీష్, యూనస్ పాల్గొన్నారు.