గోదావరిఖని : సింగరేణి (Singareni)మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట బాధితులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు. తమ మారుపేర్ల సమస్య పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసనకు దిగారు. సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కరిం ఉద్యోగాలు ఇవ్వాలని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం అనేకసార్లు తరాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజాప్రతినిధులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీనివాస్, లక్క శ్రావణ్, రామిండ్ల సందీప్, ఇంజపెళ్లి ఓం ప్రకాష్, దుమ్మటి రాజు, జిల్లాల శ్రావణ్, ఈర్ల సతీష్, మాచర్ల నవీన్ కుమార్, సునీల్ రెడ్డి, పార్థపల్లి హరీష్, గాడిచర్ల వెంకటస్వామి, కుమార్ యాదవ్, హిమబిందు, కొమరమ్మ, కాసు బీరయ్య, ప్రదీప్ కుమార్, రమేష్, సతీష్, కుమార్ యాదవ్, నరేష్ పాల్గొన్నారు.