కోల్ సిటీ, మార్చి 24 : రామగుండం(amagundam) మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆ డివిజన్క్ చెందిన మేకల అబ్బాస్ యాదవ్ సోమవారం గోదావరిఖని మారుతి నగర్లో గల వాటర్ ట్యాంక్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో జరిగిన స్క్రాప్ కుంభకోణాన్ని వెలికి తీసి ఆ నిధులను డివిజన్ అభివృద్ధి పనులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
డివిజన్ పరిధిలోని వెటర్నరీ హాస్పిటల్లో ఒక గదిని మాజీ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ కబ్జా చేశాడని ఆరోపించారు. మారుతి నగర్ లో గల వాటర్ ట్యాంక్ నుండి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులు జోక్యం చేసుకొని పరిష్కరించని పక్షంలో రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని స్పష్టం చేశారు.