Korukanti Chander | గోదావరిఖని, నవంబర్ 25 : రామగుండంలో రాక్షస పాలన రాజ్యమేలుతుందని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఒక నియంతలాగా పరిపాలన చేస్తున్నాడు. మైసమ్మ గుళ్లను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని, సింగరేణిలో నిర్మాణం చేస్తున్న నూతన వ్యాపార సముదాయంలో కూల్చివేతలకు గురైన చిరువ్యాపారులకు ఉచితంగా దుకణాలు ఇవ్వాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
సింగరేణి నిర్మాణం చేస్తున్న నూతన వ్యాపార సముదాయాలు కూల్చివేతలకు గురైన చిరువ్యాపారులకు ఉచితంగా అందించాలని, దారి మైసమ్మ గుడులను కుల్చిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఛలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక కళ్యాన్ నగర్ చౌరస్తా నుండి బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారాల సముదాయాల కూల్చివేతల పర్వం సాగుతుందన్నారు. ఎమ్మెల్యే నియంతగా వ్యవహరిస్తూ పూర్వ వైభవం పేరిట చిరువ్యాపారుల జీవితాలను రోడ్డున పడవేశారన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 46 మైసమ్మ గుడులను ఎవరు కూల్చారు..? ఖచ్చితమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందని మైసమ్మ గుడులను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ప్రజా పాలన కాదు పోలీసు పాలన..
ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక చౌరస్తా, గాంధీ నగర్ ఎన్టీసీసీ ఏరియాలో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసి వారి కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. జీవితాలు సింగరేణి ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్న దుకాణాలు చిరు వ్యాపారులకు ఉచితంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రజా పాలన కాదు పోలీసు పాలన నడుస్తోందని శాంతియుతంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఛలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని దౌర్జన్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం దారుణం అన్నారు.
రామగుండంలో నడుస్తున్న బుల్డోజర్ పాలనకు ప్రజలు చరమగీతం పడే రోజులు దగ్గరలో ఉన్నాయని చిరు వ్యాపారులకు అండగా మైసమ్మ గుడులను కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బోడ్డు రవీందర్, బాదె అంజలి, చెలకలపల్లి శ్రీనివాస్, మేడి సదానందం, నారాయణదాసు, మారుతి, నూతి తిరుపతి, మేతుకు దేవరాజ్, దొమ్మేటి వాసు, బుర్రి వెంకటేష్, సట్టు శ్రీనివాస్, నీరటీ శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావన్, జిట్టవేన ప్రశాంత్ కుమార్, కిరన్ జీ, చింటూ, ఆవునూరి వెంకటేష్, ముద్దసాని సంధ్యా రెడ్డి, లక్ష్మి, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త