పెద్దపల్లి రూరల్ , మార్చి17: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ (Quality electricity)సరఫరాను అందించడమే ప్రదాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెద్దపల్లి ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. తన సొంత గ్రామమైన హన్మంతునిపేటలో గ్రామస్తుల కోరిక మేలకు లో ఓల్టేజి నివారణకు 17/15 kv డీటీఆర్ ట్రాన్స్ ఫార్మ ర్ ను గ్రామస్థుల సమక్షంలో క్రేన్ సహకారంతో అమర్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎక్కడా లోటు రానిచ్చే పరిస్థితి లేదని, ప్రజల సహకారంతో అన్ని సమస్యలను అధిగమిస్తూ ప్రజామోద యోగ్యమైన కరెంటును అవసరమైన మేరకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.